కారు ప్రమాదంలో BRS మహిళా ఎమ్మెల్యేకు గాయాలు

223237చూసినవారు
కారు ప్రమాదంలో BRS మహిళా ఎమ్మెల్యేకు గాయాలు
నల్గొండ బీఆర్ఎస్ బహిరంగ సభకు హాజరై అక్కడి నుంచి తిరిగి వస్తున్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారును ఆటో ఢీకొట్టింది. దీంతో కారు ముందు టైరు ఊడిపోయింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే తలకు స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. కారులో ఎమ్మెల్యేతో పాటు ఆమె సోదరి నివేదిత, ఇద్దరు గన్‌మెన్‌లు ఉన్నట్లు సమాచారం. నార్కట్‌పల్లి దాటాక చెర్లపల్లి వద్ద ప్రమాదం జరిగింది.

సంబంధిత పోస్ట్