AP: నాగార్జున వర్సిటీ పరిధిలోని బీఎడ్ కళాశాలలో జరుగుతున్న మొదటి సెమిస్టర్ ప్రశ్నపత్రం అరగంట ముందుగానే సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. గుంటూరు జిల్లాలోని డెల్టా ప్రాంతానికి చెందిన ఓ కళాశాల యాజమాన్యం ప్రశ్నపత్రాన్ని లీక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 6 నుంచి మొదటి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. నిన్నటి ప్రశ్నపత్రం కూడా అరగంట ముందుగానే బయటకు వచ్చినట్లు సమాచారం.