TG: బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలపై పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన శుక్రవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 27న జరగబోయే బహిరంగ సభపై పార్టీ నేతలతో బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఎర్రవెల్లి నివాసంలో సుధీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా రజతోత్సవ వేడుకలపై పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.