హీరో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్ట్ అయ్యారు. నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్‌ను పోలీసులు తరలించారు. ఈ క్రమంలో నాంపల్లి కోర్టు వద్దకు సినీ ప్రముఖులు, ఆయన అభిమానులు తరలి వచ్చారు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కోర్టులో అల్లు అర్జున్‌ని కలిసి ధైర్యం చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.