తెలంగాణ హైకోర్టు అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సంధ్య థియేటర్ కేసులో అల్లు అర్జున్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆయన తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి హైకోర్టులో వాదనలు వినిపించారు. తొక్కిసలాట సమయంలో హీరో అల్లు అర్జున్ ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నాడన్నారు. కానీ గ్రౌండ్ ఫ్లోర్‌లో తొక్కిసలాట జరిగిందని కోర్టుకు వివరించారు. రేవతి గ్రౌండ్ ఫ్లోర్‌లో జరిగిన తొక్కిసలాటలో చనిపోయిందని న్యాయవాది నిరంజన్ కోర్టుకు తెలిపారు.