సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. అయితే బన్నీ ప్రమేయం లేకుండా జరిగిన ప్రమాదంలో ఆయనను అరెస్ట్ చేయడం ఏమిటని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూపీలోని హాథ్రస్ సత్సంగ్‌లో జరిగిన తొక్కిసలాటలో 121 మంది చనిపోయినా 'భోలే బాబా'ను అరెస్ట్ చేయలేదని, అల్లు అర్జున్‌ని మాత్రం అరెస్ట్ చేస్తారా?’ అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.