పొరుగు రాష్ట్రం ఒడిశాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గంజాం జిల్లాలో జరుగుతున్న ఓ నాటకంలో దయ్యం పాత్ర పోషించిన 45 ఏళ్ల నటుడు స్టేజ్‌పై బతికి ఉన్న పంది కడుపుని కత్తితో చీల్చి దాని మాంసాన్ని తిన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి సంచలనం సృష్టించడంతో నటుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై జంతు హింస, వన్యప్రాణి సంరక్షణ చట్టం ఉల్లంఘన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.