Dec 12, 2024, 13:12 IST/ఆదిలాబాద్
ఆదిలాబాద్
నార్నూరు: ప్రతి ఒక్కరూ గంజాయి నిర్మూలనపై సహకరించాలి: ఎస్పీ
Dec 12, 2024, 13:12 IST
ఆదివాసీలు విద్యకు మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం అన్నారు. చలికాలం దృష్ట్యా నార్నూరు మండలంలోని కరత్వాడ గ్రామంలో పోలీస్ శాఖ తరపున గురువారం ఆదివాసులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని దుప్పట్ల పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ గంజాయి నిర్మూలనపై జిల్లా పోలీసులకు సహకరించాలన్నారు. యువత మాదకద్రవ్యాల వ్యసనాల బారిన పడకుండా చదువుపై దృష్టి సారించాలి అని సూచించారు.