AP: పాస్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి మూడు నెలల గౌరవ వేతనాన్ని విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 8,427 మంది పాస్టర్లకు రూ.12,82,78,000 నిధులు విడుదల చేస్తూ మైనారిటీ సంక్షేమ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, గతేడాది మే నెల నుంచి ప్రభుత్వం పాస్టర్లకు రూ.5 వేల గౌరవ వేతనం ఇస్తుంది.