TG: హైదారాబాద్ కూకట్‌పల్లిలోని వడ్డేపల్లి ఎంక్లేవ్‌లో విషాదం నెలకొంది. ఈ నెల 16న చిన్నారి ఆధ్రిత(2) ఆడుకుంటూ రోడ్డు మధ్యలోని స్పీడ్ బ్రేకర్‌పై కూర్చుంది. ఇదే సమయంలో ఓ కారును టర్న్ చేసే క్రమంలో ఒక్కసారిగా పాప మీద నుంచి దూసుకెళ్లింది. దీంతో చిన్నారికి తీవ్రగాయాలు అయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా గురువారం చనిపోయింది. తల్లిదండ్రులు చిన్నారుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అనుక్షణం కనిపెడుతూ ఉండాలని పలువురు సూచిస్తున్నారు.