పలు సినిమాల్లోని సాంగ్స్‌లో అభ్యంతరకర స్టెప్పులు, ఆడవాళ్లను అవమానించేలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా డాన్స్ మాస్టర్ శేఖర్ కొరియోగ్రఫీపై సోషల్ మీడియాలో ఓ యువతి ఆవేదన వ్యక్తం చేశారు. అసభ్యకర స్టెప్పులతో డాన్స్ చేయొద్దని వేడుకున్న వీడియో వైరల్ అవుతోంది. ఇక తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ సినీ ఇండస్ట్రీకి హెచ్చరికలు జారీ చేసింది.