ఆదిలాబాద్: కార్మికుల భారీ ర్యాలీ

71చూసినవారు
కార్మికశాఖ ద్వారా కార్మికులకు సంక్షేమ కోసం పథకాలను పెంచాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ పట్టణంలో కార్మికులు మహార్యాలీ బుధవారం చేపట్టారు. ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. గత 20 ఏళ్ల నుంచి కార్మికశాఖ ద్వారా ఇచ్చే సంక్షేమ పథకాల్లో ఏ విధమైన వ్యత్యాసం లేదని పేర్కొన్నారు. కార్మికులు సంఘటితమైతేనే హక్కులను సాధించవచ్చని రిటైర్డ్ లేబర్ ఆఫీసర్ జగదీష్ రెడ్డి అన్నారు. అనంతరం కలెక్టర్ ఎదుట ధర్నా చేపట్టారు.

సంబంధిత పోస్ట్