అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం

50చూసినవారు
సమాజంలో అసమానతలను రూపుమాపడానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశేష కృషి చేశారని మాజీమంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. శనివారం అదిలాబాద్ పట్టణంలోని సుభాష్ నగర్ బుద్ధవిహార్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్, గౌతమ బుద్ధుడి చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం బౌద్ధ వందనం సమర్పించి పంచశీల జెండాను ఆవిష్కరించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్