నార్నూర్ మండలంలోని జండా గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించిన రాథోడ్ హరిచంద్ సోమవారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్బంగా ఆయన్ను ఉపాధ్యాయులు, బంధువులు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం నెహ్రు, పీడీ ఆడే విశ్వనాధ్, కైలాష్, రవీందర్, శివాజీ, చంపావతి, రాజ్యలక్ష్మి, ముక్త, రజనీకాంత్ తదితరులున్నారు.