ఆదిలాబాద్: నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాలకు అనుమతి లేదు: కలెక్టర్

76చూసినవారు
ఆదిలాబాద్: నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాలకు అనుమతి లేదు: కలెక్టర్
గ్రూప్-2 పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఈ నెల డిసెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించే గ్రూప్-2 పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరిండెంట్ లు, రూట్ ఆఫీసర్స్, ఇన్విజిలేటర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. అభ్యర్థులు నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాలకు అనుమతించడం జరగదు అన్నారు.

సంబంధిత పోస్ట్