చేసిన సేవలు గుర్తింపునిస్తాయి

85చూసినవారు
చేసిన సేవలు గుర్తింపునిస్తాయి
ఉద్యోగి తన సర్వీస్ లో చేసిన సేవలు ఆయనకి గుర్తింపును ఇస్తాయని ఆదిలాబాద్ డిప్యూటీ డిఎంహెచ్ఓ సాధన అన్నారు. ఆదిలాబాద్ డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఆఫీస్ సబ్ ఆర్డినేట్ గా పనిచేస్తూ మంగళవారం ఉద్యోగ పదవి విరమణ పొందుతున్న మనపల్లి రమేష్ దంపతులను ఉద్యోగులతో కలిసి ఘనంగా సత్కరించారు. తన సర్వీస్ కాలంలో ఎలాంటి రిమార్కు లేకుండా ఉద్యోగ విరమణ పొందడం గొప్ప విషయం అన్నారు. శేష జీవితం ఆయురారోగ్యాలతో కొనసాగాలని అకాంక్షించారు.

సంబంధిత పోస్ట్