ఆసిఫాబాద్ మండలం దస్నాపూర్-2 అంగన్‌వాడీ కేంద్రంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే శనివారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలను పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.