మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి పట్టణంలో ప్రేమించిన యువకుడు పెండ్లి చేసుకుంటానని మోసం చేయడంతో సాయి స్నేహిత ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కాగా, స్నేహిత తండ్రి మాట్లాడుతూ.. 'నా బిడ్డ చావుకు కారణమైన వాడిని వదలొద్దు. వాడి టార్చర్ భరించలేకే నా కూతురు ఆత్మహత్య చేసుకుంది. ప్రతి రోజు ఫోన్లు చేసి నరకం చూపించేవాడు. నా బిడ్డకు పట్టిన గతే వాడికి కూడా పట్టాలి' అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.