ప్రభుత్వం అందిస్తున్న కాటమయ్య రక్షణ కిట్లను సద్వినియోగం చేసుకోవాలని ఎక్సైజ్ శాఖ సిఐ ఇంద్ర సింగ్ తెలిపారు. బెల్లంపల్లి మండలంలోని తాళ్ల గురిజాల గ్రామంలో గీత కార్మికులకు రక్షణ కిట్లపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారికి రక్షణ కిట్లు అందజేశారు. తాటి చెట్టు ఎక్కే విధానంపై గీతా కార్మికులకు అవగాహన కల్పించారు. రక్షణ కిట్లు లేకపోవడంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని వెల్లడించారు.