ఇచ్చోడ మండల కేంద్రంలో బంద్

67చూసినవారు
ఇచ్చోడ మండల కేంద్రంలో శుక్రవారం హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బంద్ నేపథ్యంలో హిందు సంఘాల నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో విస్తృతంగా తిరుగుతూ తెరిచి ఉన్న షాపులను బంద్ చేయించారు. బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీసుల ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు పలువురు వ్యాపార స్వచ్ఛందంగా బంద్ చేశారు.

సంబంధిత పోస్ట్