ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రిని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో వసతులను పరిశీలించారు. రిమ్స్ డైరెక్టర్ జైసింగ్‌తో మాట్లాడుతూ. ఎప్పటికప్పుడు చురుగ్గా వైద్యం అందేలా చూడాలని వసతులను మెరుగు పరచాలని సూచించారు. రిమ్స్‌లో గల సహాయ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రోగులకు అందిస్తున్న సేవలు ఆరా తీశారు. అనంతరం పలువురిని పరామర్శించారు.