కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపునకు నేతలు పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్లాలని ఎమ్మెల్సీ ఎన్నికల బోథ్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శుక్రవారం బోథ్‌లో నియోజకవర్గ స్థాయి పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోలేదని ఆరోపించారు.