విద్యుత్ కోతలను నిరసిస్తూ రైతుల ఆందోళన

78చూసినవారు
విద్యుత్ కోతలను నిరసిస్తూ రైతుల ఆందోళన
అదిలాబాద్ జిల్లా తాంసి మండలంలో విద్యుత్ కోతలను నివసిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. జామిడి గ్రామ రైతులు శుక్రవారం తాంసి విద్యుత్ కేంద్రం ఎదుట నిరసన చేపట్టారు. ప్రతి నిత్యం గంటల తరబడి విద్యుత్ సరఫరాలో అంతరాయంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని మార్లు అధికారులకు, సిబ్బంది చెప్పిన పట్టించుకోవడంలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ సాగు సమయంలో విద్యుత్ సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు.

సంబంధిత పోస్ట్