గుడిహత్నూర్ విద్యుత్ వినియోగదారులకు సౌకర్యార్థమే సీజీఆర్ఎఫ్ పనిచేస్తుందని తెలంగాణ ఉత్తర విద్యుత్తు పంపిణీ సంస్థ సీజీఆర్ఎఫ్ చైర్మన్ ఎరుకల నారాయణ అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన వినియోగదారుల ఫిర్యాదులు పరిష్కార వేదికలో ఆయన పాల్గొని మాట్లాడారు. వినియోగదారులు ఎలాంటి సమస్యలు ఉన్న తెలియజేయాలన్నారు. పరిష్కారం కానీ పక్షంలో తమ దృష్టికి తీసుకువస్తే నిర్ణీత కాల పరిమితిలో పరిష్కరిస్తామన్నారు.