గుడిహత్నూర్: రోడ్డు ప్రమాదంలో గాయాలపడిన యువకుడు మృతి

58చూసినవారు
గుడిహత్నూర్: రోడ్డు ప్రమాదంలో గాయాలపడిన యువకుడు మృతి
గుడిహత్నూర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాలపడిన యువకుడు మృతి చెందినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. ఇచ్చోడా మండలం మాధపూర్ గ్రామానికి చెందిన మొజహీద్ 21 అనే యువకుడు షైక్ ఓవైస్ తో కలిసి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న క్రమంలో శర్మ దాబా వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. యువకుడిని రిమ్స్ ఆసుపత్రికి తరలించాగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్