ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటిస్తూ, చదువులో రాణిస్తూ, ఆదర్శవంతంగా నిలవాలని విద్యార్థులకు మహిళా సాధికారికత జెండర్ స్పెషలిస్ట్ కృష్ణవేణి సూచించారు. ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నేరేడిగొండ జడ్పీఎస్ఎస్ పాఠశాలలో కాలానుగుణ వ్యాధుల అంశంపై విద్యార్థులకు వారు అవగాహన కల్పించారు. చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది కోటేశ్వర్, నిఖిలేశ్వర్, పాఠశాల సిబ్బంది, తదితరులున్నారు.