ఖానాపూర్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

52చూసినవారు
ఖానాపూర్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
బైక్ అదుపుతప్పి కింద పడి వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని ఎల్లాపూర్ గ్రామంలో సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం దిలావర్పూర్ గ్రామానికి చెందిన రవీందర్ గౌడ్ నడుపుతున్న బైక్ అదుపు తప్పి కింద పడడంతో ఎడమ కాలుకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది శేఖర్, ఆఫీజ్ చికిత్స అందించి జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్