ఉట్నూర్: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

53చూసినవారు
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన గురువారం ఉట్నూర్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నాగపూర్ ఓ పత్తి ఏరడానికి కొంత మంది మహిళలు వెళ్లారు. సాయంత్రం వారు ఓ ఆటోలో ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో ఆటోను వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. మిగితా వారికి గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్