జన్నారం అభయారణ్యంలో జిఎస్ఐ డైరెక్టర్ పర్యటన
జియోజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్, వృక్ష శాస్త్రవేత్త డాక్టర్ మంజుషా మహాజన్ ఆదివారం జన్నారం మండలంలోని కవ్వాల్ అభయారణ్యంలో స్లోవేకియాకు చెందిన విద్యార్థులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా అభయారణ్యంలో అడవులు, వన్యప్రాణులు, పశుపక్షాదుల రక్షణకు తీసుకుంటున్న చర్యల గురించి స్థానిక అటవీ అధికారులు జిఎస్ఐ డైరెక్టర్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అటవీ అధికారులు ఉన్నారు.