కడెం ప్రాజెక్టు 993 క్యూసెక్కుల ఇన్ ఫ్లో
ఎగువ కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్టు వరద నీరు వచ్చి చేరుతుందని గురువారం ఉదయం అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా ప్రాజెక్టులో 699. 375 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. ప్రాజెక్టులోకి 993 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుందని అన్నారు. వివిధ అవసరాల కోసం 906 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.