పాముకాటుకు వృద్ధురాలు మృతి

3972చూసినవారు
పాముకాటుకు వృద్ధురాలు మృతి
దండేపల్లి మండల కేంద్రానికి చెందిన కామెర భూమక్క అనే వృద్ధురాలు పాముకాటుతో మృతి చెందినట్లు ఎస్సై భూమేష్ తెలిపారు. ఈ నెల 27న తన ఇంటివద్ద పనిచేసే క్రమంలో నాగుపాము కాటేసింది. గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక పీహెచ్సీకి, మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్