మంచిర్యాల మార్కెట్లో మంగళవారం సాయంత్రం ఓ పాము కలకలం రేపింది. బుధవారం ఎంగిలిపూల బతుకమ్మ పండుగ నేపథ్యంలో రైతులు ఆయా ప్రాంతాల నుంచి పూలను మార్కెట్ కు తీసుకొచ్చారు. ఆ మూటల నుంచి ఓ పాము ఒక్కసారిగా బయటకు వచ్చి ప్రజల కాళ్ళ మధ్యనే తిరగడంతో భయంతో పరుగులు తీశారు. చివరకు పక్కన ఉన్న కాలువలోకి అది వెళ్లిపోవడంతో అక్కడ ఉన్న వారందరూ ఊపిరి పీల్చుకున్నారు.