ఆలయంలో తాత్కాలిక ఉద్యోగురాలికి పాము కాటు

65చూసినవారు
ఆలయంలో తాత్కాలిక ఉద్యోగురాలికి పాము కాటు
బాసర ఆలయంలోని డార్మిటరీ భవనంలో తాత్కాలికంగా విధులు నిర్వర్తిస్తున్న శారద (40) అనే మహిళకు శుక్రవారం పాము కాటు వేసింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అంబులెన్సులో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. అధికారుల నిర్లక్షం కారణంగానే డార్మిటరీ భవనానికి కనీసం తలుపులు లేక పాములు చొరబడుతున్నాయని తాత్కాలిక ఉద్యోగులు మండి పడుతున్నారు.

సంబంధిత పోస్ట్