భైంసా:చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి

82చూసినవారు
భైంసా:చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వృద్ధుడు చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ముథోల్ నయాబాదీ కాలనీకి చెందిన దత్త (65) ఆదివారం ఉదయం ఇంటి నుంచి బస్టాండ్ కు వెళ్తుండగా భైంసా డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంజీవ్ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్