అటవీ జంతువులను వేటాడితే కఠిన చర్యలు తప్పవని అటవీశాఖ రేంజ్ అధికారి రామకృష్ణారావు తెలిపారు. శుక్రవారం తమ సిబ్బంది గస్తీ నిర్వహిస్తుండగా వేటగాళ్లు పట్టుబడినట్లు చెప్పారు. లోకేశ్వరం మండలంలోని లక్ష్మినగర్ తండాకు చెందిన నగేశ్, మూడ్ శంకర్లు 3 అడవి కుందేళ్లు, 5 కంజు పిట్టలు వేటాడి వాటిని విక్రయానికి తీసుకెళుతుండగా పట్టుకున్నట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి, నిందితులను రిమాండుకు తరలించినట్లు చెప్పారు.