భైంసా పట్టణంలోని కుంట గల్లీకి చెందిన మహిళ (46) అదృశ్యమైనట్లు సీఐ గోపీనాథ్ సోమవారం రాత్రి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లాలో చదువుకుంటున్న తన కూతురును చూసి వస్తానని ఈ నెల 25న తల్లికి చెప్పి వెళ్ళింది. సాయంత్రం వరకు రాక పోవడంతో ఆమె కూతురుకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో బంధువుల వద్ద ఆరా తీయగా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పోలీస్ స్టేషన్ లో తల్లి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.