భైంసా మండలం ఇలేగాం గ్రామంలో రిటైర్మెంట్ ఆర్మీ ఉద్యోగి కేసరిని కవి, రచయిత, పోస్ట్ మాస్టర్ రెడ్ల బాలాజీ సోమవారం ఘనంగా సన్మానించారు. బాలాజీ మాట్లాడుతూ, ఈరోజు మనం సుఖంగా, సంతోషంగా ఉన్నామంటే దేశానికి కాపలా కాస్తూ శత్రువుల నుండి మనల్ని కాపాడుతున్న నిజమైన హీరోలు ఆర్మీ ఉద్యోగులే అని అన్నారు. వారిని గుర్తించడం, సత్కరించడం మనందరి బాధ్యత అని అన్నారు.