వాహనం ఢీకొని చిన్నారి మృతి

21759చూసినవారు
వాహనం ఢీకొని చిన్నారి మృతి
దిలావర్పూర్ మండలం కంజర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మండల కేంద్రం నుండి భారత్ గ్యాస్ సిలిండర్ వాహనం గ్రామానికి వచ్చింది. వాహనం ఒక్కసారిగా అనయా ఫాతిమా అనే చిన్నారిపైకి దూసుకెళ్లింది. తల భాగంకు తీవ్రమైన గాయం కావడంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై సుమంజాలి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్