తానూరు మండలం మహలింగిలో శుక్రవారం తాళం వేసిన ఇంట్లోకి నలుగురు దుండగులు చొరబడి చోరీకి పాల్పడ్డారు. గ్రామస్తుల వివరాల ప్రకారం గ్రామంలో ఇద్దరు వ్యక్తులు కాలం చేయగా, గ్రామస్తులు అంత్యక్రియలకు హాజరయ్యారు. ఎవరూ లేరని గమనించిన దుండగులు డబ్బాలు అమ్ముతామంటూ తిరుగుతూ ఫిరాజి ఇంట్లో చొరబడి దొంగతనానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. గమనించిన గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.