యూబిట్ కాయిన్ వ్యవహారంలో ఆర్థిక నేరాలకు పాల్పడిన ఉపాధ్యాయులను సస్పెండ్ చేసి వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా పిఆర్టియు నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం నిర్మల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఉద్యోగ సంఘాల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న సంఘ నాయకులు యూబిట్ చైన్ లాక్స్ సిస్టంలో ఉన్నారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పిఆర్టియు సంఘ నాయకులు పాల్గొన్నారు.