కాగజ్‌నగర్ మండలం ఈస్గాం విలేజ్ నెంబర్ 12 గ్రామంలోని పంట పొలాల్లో పెద్దపులి సంచరిస్తూ స్తానికులకు శుక్రవారం కంటపడింది. విలేజ్ నంబర్ 6లో మహిళపై దాడి చేసి, పంట పొలాల నుంచి వెళ్తుండగా పలువురు వీడియోలో చిత్రీకరించారు. పులి గ్రామాల్లోకి రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ అధికారులు స్పందించి పులి బారి నుంచి రక్షించవలసిందిగా కోరుతున్నారు.