భారత్‌తో పాటు మరో 120 దేశాల్లో లెనకపవిర్ అనే HIV ఔషధాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, హెటెరో ల్యాబ్స్ సన్నద్ధమవుతున్నాయి. ఈ ఔషధం ఉత్పత్తి, విక్రయాలకు అమెరికా బయో ఫార్మా సంస్థ గిలీడ్ సైన్సెస్‌తో స్వచ్ఛంద లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు కంపెనీలు వెల్లడించాయి. ఇది నాన్-ఎక్స్‌క్లూజివ్ ఒప్పందం. ఈ మెడిసిన్ గత రెండేళ్లుగా ‘సన్‌లెంకా’ బ్రాండ్ పేరుతో అమెరికా, ఐరోపాల్లో అందుబాటులో ఉంది.