‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (AI).. ప్రస్తుతం ఎవరి నోట విన్నా ఇదే మాట. ఏఐ ద్వారా వింతలు వినోదాలు సృష్టిస్తున్నారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అలాంటి వీడియోనే ఇప్పుడు మరొకటి వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో ఓ బీచ్ వద్ద ఆవు, ఏనుగు, సింహం, జిరాఫీ, జీబ్రా, పాము, ఖడ్గమృగం వంటి జంతువులు రెండు కాళ్లతో నడుస్తున్నట్లు వీడియోని సృష్టించారు.