ఒక జిల్లాలో టికెట్ తీసుకొని, ఇంకో జిల్లాలో రైలు ఎక్కే స్టేషన్ ఎక్కడ ఉంది?

567చూసినవారు
ఒక జిల్లాలో టికెట్ తీసుకొని, ఇంకో జిల్లాలో రైలు ఎక్కే స్టేషన్ ఎక్కడ ఉంది?
భారత్ లో ఒకే సమయంలో రెండు జిల్లాల్లో రైలు ఆగే ఏకైక రైల్వే స్టేషన్ యూపీలోని కంచౌసి రైల్వే స్టేషన్. ఇక్కడ రైలు ఆగినప్పుడు సగ భాగం కాన్పూర్ దేహత్ జిల్లాలో, మిగిలిన సగం ఔరయా జిల్లాలో విస్తరించి ఉంటుంది. ఈ స్టేషన్ ప్లాట్‌ఫారమ్ ఔరయా జిల్లాలోకి, స్టేషన్ కార్యాలయం కాన్పూర్ దేహత్ జిల్లా పరిధిలోకి వస్తుంది. దీంతో ఇక్కడ రైలు ఎక్కేవారు ఒక జిల్లాలో టికెట్ తీసుకొని, మరో జిల్లాలో రైలు ఎక్కినట్లు అవుతుంది.

సంబంధిత పోస్ట్