ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్.. 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఫ్రీడం సేల్ పేరుతో ప్రత్యేక ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కింద ప్రారంభ విమాన టికెట్ ధరను రూ.1,947గా నిర్ణయించింది. ఈ నెల 5 లోపు బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు సెప్టెంబర్ 30లోగా ప్రయాణించాల్సి ఉంటుందని పేర్కొంది.