ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. కారణం ఇదే

75చూసినవారు
ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. కారణం ఇదే
దుబాయ్ నుంచి వస్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. భద్రతా కారణాల దృష్ట్యా కేరళలోని మలప్పురం జిల్లాలోని కరిపూర్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. విమానంలోని హైడ్రాలిక్ సిస్టమ్‌లో కొంత లోపం ఉందని పైలట్ తెలిపారు. ఆ తర్వాత ల్యాండ్‌ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎయిర్ ఇండియా విమానం ఐఎక్స్ 344 ఉదయం 8:30 గంటలకు కరిపూర్‌లో ల్యాండ్ అయింది. అంతకుముందు ఇక్కడి విమానాశ్రయం మొత్తంలో ఎమర్జెన్సీని ప్రకటించారు.

సంబంధిత పోస్ట్