రేషన్ కార్డుదారులకు అలర్ట్

55717చూసినవారు
రేషన్ కార్డుదారులకు అలర్ట్
తెలంగాణ ప్రభుత్వం పథకాలు అందించడంలో భాగంగా రేషన్ కార్డులకు e-KYCని తప్పనిసరి చేసింది. ఇప్పటికే FEB 29తో గడువు ముగియగా మరోసారి పొడిగించింది. మొత్తం లబ్ధిదారుల్లో ఇప్పటివరకు 74% మందే KYC నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో దగ్గరలోని రేషన్ దుకాణాలకు వెళ్లి త్వరగా ఈ-కేవైసీ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతానికి గడువు తేదీ ప్రకటించనప్పటికీ.. మరోసారి గడువు పొడిగించే అవకాశం ఉండకపోవచ్చని అంటున్నారు.

సంబంధిత పోస్ట్