భద్రాద్రి జిల్లాలోకి తాడ్వాయి పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న పెద్దపులి ప్రవేశించింది. దీంతో పులి సంచరించే ప్రాంతంలోని గ్రామాల ప్రజలను అటవీ అధికారులు అలర్ట్ చేశారు. గుండాల, అల్లపల్లి మండలాల్లో గత 3 రోజుల నుండి పులి భయాందోళనలకు గురిచేస్తోంది. ప్రస్తుతం పినపాక, ఇల్లందు, కొత్తగూడెం అటవీ పరిసర ప్రాంతాల్లో పులి తిరుగుతున్నట్లుగా గుర్తించారు. పెద్దపులి రోజుకు 20కిలో మీటర్లు తిరిగే అవకాశముందని, ప్రజలు జాగ్రతగా ఉండాలని సూచించారు.