ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై సోమవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని ఆయన తరపు లాయర్ హైకోర్టును కోరారు. దీనిపై హైకోర్టు జడ్జి కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసుల అభిప్రాయం తెలుసుకుని మధ్యాహ్నం 2.30 గంటలకు వరకు చెబుతామని వెల్లడించారు. అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని లాయర్ కోరగా హైకోర్టు తిరస్కరించింది. ఉదయం 10.30 గంటల లోపు పిటిషన్ జత చేయాల్సిందని హైకోర్టు చెప్పింది.