బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నాగవంశీ నిర్మించిన చిత్రం 'డాకు మహారాజ్'. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా నిర్మాతకు కంగ్రాట్స్ చెబుతూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా ఓ ఫ్లవర్ బొకే పంపించారు. అల్లు అర్జున్ విషెస్‌పై నిర్మాత నాగవంశీ స్పందిస్తూ బన్నీకి థాంక్స్ చెబుతూ సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.